జాతీయం

వెట్టి చాకిరి ఆరోపణలపై భారత్‌పై 12.5% అదనపు సుంకం ప్రతిపాదించిన అమెరికా

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వెట్టి చాకిరి ఆరోపణలపై భారత్‌పై 12.5% అదనపు సుంకం ప్రతిపాదించిన అమెరికా
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

వెట్టి చాకిరి నిర్మూలనలో విఫలమయ్యాయనే ఆరోపణలతో భారత్ సహా 54 దేశాలపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జెమిసన్ గ్రేర్ ప్రతిపాదించారు.

మొత్తం 60 దేశాలపై దర్యాప్తు పూర్తి చేసిన గ్రేర్, ఈ మేరకు ప్రతిపాదనను విడుదల చేశారు. ఇందులో భాగంగా, ఇప్పటికే పాక్షిక నిషేధాలు విధించిన లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఆంక్షలు హామీ ఇచ్చిన 6 ఆర్థిక వ్యవస్థలకు 10% అదనపు సుంకాన్ని, ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా సహా మిగిలిన 54 దేశాలకు 12.5% సుంకాన్ని ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, వివరణ ఇచ్చుకునేందుకు జూలై 6 వరకు USTR గడువు ఇచ్చింది. తర్వాత జూలై 7న బహిరంగ విచారణ నిర్వహించనుంది.

ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అంశాలను ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని, తమపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com