US విద్యార్థుల వీసాల్లో భారీ తగ్గుదల: 2025లో ఇండియన్ స్టూడెంట్స్‌కు F1 వీసాలు 62% తగ్గాయి
2025 అడ్మిషన్ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు US జారీ చేసిన F1 స్టూడెంట్ వీసాల సంఖ్య 62% తగ్గిందని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (CIS) వెల్లడించింది.
2024 మే-ఆగస్టు మధ్య 58,694 వీసాలు జారీ కాగా, 2025 ఇదే కాలంలో కేవలం 22,149 వీసాలు మాత్రమే ఇచ్చారు. సాధారణంగా ఈ సీజన్‌లో సగటున 50,000కు పైగా విద్యార్థి వీసాలు భారతీయులకు లభిస్తుంటాయని CIS నివేదిక పేర్కొంది.
చైనాతో పోల్చితే భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురైన సంఖ్య దాదాపు రెట్టింపు ఉందని కూడా CIS వివరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com