నెంబర్ 3 జర్సీ వైభవ్ సూర్యవంశికి దక్కింది - సచిన్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం
టీమ్ ఇండియా నెంబర్ 3 జర్సీ ఇప్పుడు ఒక కొత్త సంచలనానికి సొంతమైంది. ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన 15 ఏళ్ల యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశికి BCCI ఈ జర్సీని కేటాయించింది. హోటల్ గదిలో త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా BCCI ఈ జర్సీని వైభవ్కు అందించింది.
తన పేరు చూసుకున్న వైభవ్ ఆనందంతో మురిసిపోయాడు. తన నెంబర్ జర్సీని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. పరవశం పొందాడు. ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఏ క్రికెటర్కైనా భారత జాతీయ జట్టులో ఆడాలని కోరిక ఉంటుంది. దానికోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి కలను వైభవ్ కేవలం 15 ఏళ్లలోనే నెరవేర్చుకున్నాడు.
IPL లో అండర్ 19 మరియు India A మ్యాచ్లు ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం ఇదే తొలిసారి. తొలిసారి బ్యాట్ పట్టినప్పుడు కన్న కల నిజమైందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని వైభవ్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ పర్యటనలో జూన్ 26 లేదా 28 తేదీల్లో ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక రికార్డు బద్దలవుతుంది. 16 ఏళ్ల 205 రోజుల వయసులో సచిన్ అరంగేట్రం చేయగా, వైభవ్ కేవలం 15 ఏళ్లకే బరిలోకి దిగి అత్యంత పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
వైభవ్కు ఈ అవకాశం ఊరికే రాలేదు. IPL 2025 సీజన్ లో 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ ను ముద్దాడాడు. తద్వారా అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ సాధించిన సాయి సుదర్శన్ రికార్డును తిరగరాశాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ లోని భారత జట్టు మంగళవారం ఐర్లాండ్ కు బయలుదేరింది. జర్సీ నెంబర్ 3 తో బయలుదేరిన వైభవ్ పైనే అన్ని కళ్ళు కేంద్రీకృతమయ్యాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com