భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం; శ్రీలంక ఆటగాడిని నెట్టేశాడు
భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ ఓ శ్రీలంక ఆటగాడిని నెట్టేసిన ఘటన వీడియోలో కనిపించింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఏ ఓటమి తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏ 16 పరుగులు సాధించింది. లక్ష్య చేదనలో భారత్ ఏ తొమ్మిది పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు విజయోత్సవంలో భారత ఓపెనర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఒక శ్రీలంక క్రికెటర్ చాతిపై చెయ్యి పెట్టి నెట్టేశాడు. ఆ ఘటన తర్వాత ఇరువురి మధ్య తోపులాట జరగడంతో లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైభవ్‌ను పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్ లోనూ రాణించలేదు; 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు.
గత ఏడాది అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ బౌలర్ అలీ రజాతో వాగ్వాదంతో వైభవ్ వార్తల్లో నిలిచాడు. వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్న యువ ఆటగాడు ఆవేశాన్ని నియంత్రించుకోవాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com