ఆంధ్రప్రదేశ్

విశాఖలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి; క్యాప్సికం రూ.120, అల్లం రూ.220

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విశాఖలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి; క్యాప్సికం రూ.120, అల్లం రూ.220
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

విశాఖపట్నంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. క్యాప్సికం కిలో రూ.120, చిక్కుడు రూ.100, క్యారెట్ రూ.80, బీట్రూట్ రూ.60 వరకు పలుకుతోంది. టమాటో, వంకాయ, క్యాబేజీ వంటి కూరగాయలు రూ.40-50 లోపులో ఉన్నా నాణ్యత సంతృప్తికరంగా లేదు.

గత నెలతో పోలిస్తే అల్లం, వెల్లుల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం అల్లం కిలో రూ.220, వెల్లుల్లి రూ.200గా ఉన్నాయి. రైతు బజార్లలో మాత్రం కూరగాయలు రూ.10-20 వరకు తక్కువ ధరకు లభిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బజార్లు తక్కువగా ఉండడంతో ప్రజలు రిటైల్ మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోంది.

కొంతమంది రిటైల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, నాణ్యత లేని సరుకును అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వర్షాలు సక్రమంగా లేకపోవడం, ఎలీనా ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం ధరలు ఎక్కువగా ఉండటానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

రెండు మూడు రోజుల్లో వర్షాలు బాగా పడితే కూరగాయల సాగు పుంజుకుని ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com