ప్రత్యర్థులను శత్రువులుగా చూడవద్దని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి
రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, ప్రత్యర్థి పార్టీల వారిని శత్రువులుగా చూడడం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో రసమయి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత టీ.డి. జనార్ధన్కు ఎన్టీఆర్ పురస్కారాన్ని వెంకయ్య నాయుడు ప్రధానం చేశారు. తెలుగువారు సోదరభావంతో కలిసి ఉండాలని ఆయన సూచించారు.
వ్యక్తిగత దూషణలకు దిగడం సరైనది కాదని, విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తొలి రోజుల్లోనే పెను మార్పు తీసుకువచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com