తెలంగాణ

దొంగలకు ఆశ్రయమిచ్చిన విజయలక్ష్మి లాడ్జ్ సీజ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
దొంగలకు ఆశ్రయమిచ్చిన విజయలక్ష్మి లాడ్జ్ సీజ్
📷 Sora Shimazaki / Pexels
షేర్ కాపీ అయింది ✓

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్‌ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సీజ్ చేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని PNJ జ్యువెలరీ షాప్‌లో దొంగతనానికి పాల్పడిన ఐదుగురు నిందితులు ఈ నెల 1, 2 తేదీలలో ఆ లాడ్జ్‌లో బస చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు అధికారులకు సమాచారం అందింది.

లాడ్జ్‌కు trade license లేదని, residential భవనంలో commercial activity జరుగుతోందని అధికారులు గుర్తించారు. Municipal Act ప్రకారం సీజ్ చేశామని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.

ధర్మపురిలో commercial activity నడిపే వారందరూ స్వచ్ఛందంగా municipal office కి వచ్చి trade license కి apply చేయాలని కమిషనర్ కోరారు. license తీసుకోని వారికి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com