హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:39 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

విజయవాడ థార్ కార్ల ఘర్షణ: ఇద్దరు నిందితులపై 307 కేసు నమోదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విజయవాడ థార్ కార్ల ఘర్షణ: ఇద్దరు నిందితులపై 307 కేసు నమోదు
📷 Akhil Dasari / Pexels
షేర్ కాపీ అయింది ✓

విజయవాడ పటమట ప్రాంతంలో జరిగిన థార్ కార్ల ఘర్షణ కేసులో పోలీసులు మరిన్ని సెక్షన్లు జోడించారు. నిందితులు బొల్ల ఓం, లింగమనేని రోహిత్‌లపై 307 హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇద్దరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కొద్దిసేపట్లో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడ భారతీనగర్‌కు చెందిన బొల్ల ఓం తన తండ్రితో కలిసి real estate వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒక యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.

గురువారం రాత్రి ఓం తన థార్ కార్లో పటమట RR Garden హై టెన్షన్ రోడ్డుకు వచ్చాడు. అక్కడ రోహిత్ కారుకు డీ కొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరూ సుమారు 100 మీటర్ల దూరం రోడ్డుపై పరస్పరం కార్లతో డీ కొట్టుకున్నారు. తర్వాత కార్లు దిగి hockey sticks, iron rods తో దాడి చేసుకున్నారు. కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

స్థానికుల సమాచారంతో పటమట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికి రోహిత్ కారు వదిలి పారిపోయాడు. ఓంను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com