విశాఖపట్నం: అపార్ట్‌మెంట్‌లో మహిళ హత్య, బంగారు వస్తువులు దోపిడీ
విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్‌లోని PRK నాగనంద్ హైట్స్ అపార్ట్‌మెంట్ 103వ ఫ్లాట్‌లో పార్వతి (53) హత్యకు గురయ్యారు. ఆమె భర్త చంద్రశేఖర్ సాయంత్రం 7:30కి షాప్ నుండి ఇంటికి తిరిగొచ్చి, ఆమె బెడ్‌రూమ్‌లో పడి ఉండటం చూశారు.
పార్వతి మెడపై స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై ఉన్న నల్లపూసల తాడు, చెవి దుద్దులు, గాజులు కనపడట్లేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బీరువా దగ్గర అరుగు ముక్కలు పడి ఉన్నాయని, బీరువా తెరవడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు.
ఆవిడ సాయంత్రం 5:15కి తోడుకోడలికి ఫోన్ చేసింది. అంటే ఆ సమయానికి ఆమె సురక్షితంగా ఉంది. చంద్రశేఖర్ మధ్యాహ్నం 3:30కి వెళ్లి 7:30కి తిరిగొచ్చారు. ఆ వ్యవధిలో సంఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
అపార్ట్‌మెంట్ CCTV ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపించారని పోలీసులు తెలిపారు. వారు 35-40 ఏళ్ల మధ్య వయసు వారుగా అంచనా వేస్తున్నారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానితులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
మృతురాలి ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. పార్వతి నిన్నే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com