నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్ట్ నుంచి సాగునీటి విడుదల
నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు వ్యవసాయానికి సాగునీరు విడుదల చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ ప్రాజెక్ట్ వద్ద ఉన్న మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎడమ కాలువకు 600 క్యూసెక్కులు, కుడి కాలువకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటిని వృథాగా పోనివ్వకుండా పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com