జ్యోతిష్యం

వారఫలాలు మే 24–30, 2026: ద్వాదశ రాశుల వారఫలాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వారఫలాలు మే 24–30, 2026: ద్వాదశ రాశుల వారఫలాలు
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

మే 24 నుండి 30, 2026 వరకు ద్వాదశ రాశుల వారఫలాలు ఇవి. ఈ వారం గ్రహస్థితి ఇలా ఉంది: గురువు మిధునంలో, శని మీనంలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో, బుధుడు వృషభంలో, శుక్రుడు మిధునంలో, కుజుడు మేషంలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహ, కన్య, తులా రాశుల్లో సంచరిస్తున్నాడు.

మేష రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పటి నుండో ఆగిపోయిన ఒక పని ఈ వారం జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్‌ఫర్లు అనుకూలంగా ఉంటాయి.

వృషభ రాశి వారికి ఈ వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబంలో శుభకార్య ఆలోచన ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలు కొలిక్కి వస్తాయి.

మిధున రాశి వారికి రెండో లేదా మూడో ప్రయత్నంలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా ప్రయత్నంలో కొంత ఇబ్బంది ఉంటుంది.

కర్కాటక రాశి వారికి ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ట్రాన్స్‌ఫర్లు అనుకూలంగా జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహ రాశి వారికి భూసంబంధమైన వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అగ్రీమెంట్లు కొంత సజావుగా సాగుతాయి. భూ వివాదాలకు దూరంగా ఉండాలి.

కన్య రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. భూసంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. జామీను పెట్టడం మధ్యవర్తిత్వం వద్దు.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.

వృశ్చిక రాశి వారికి కొన్ని పనులు పెండింగ్ లో పడతాయి. భూసంబంధమైన విషయాలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది.

ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. వీసా కొరకు ఎదురు చూసేవారికి సత్ఫలితాలు ఉంటాయి.

మకర రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి.

కుంభ రాశి వారికి ఉద్యోగ భద్రత పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మీన రాశి వారికి గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవివాహితులకు శుభవార్తలు ఉంటాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com