ఆఫ్రికాలో ఎబోలా వేగంగా వ్యాప్తి — WHO అత్యవసర పరిస్థితి ప్రకటించింది
కాంగో సహా పలు ఆఫ్రికా దేశాల్లో అరుదైన ఎబోలా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 136 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. 543 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 కేసులు laboratory లో నిర్ధారించబడ్డాయి.
ఈ వేరియంట్ పేరు బుండి బుయగో. దీనికి మందులు గానీ vaccines గానీ అందుబాటులో లేవని health experts తెలిపారు. తొలి మరణం నమోదైన తర్వాత కూడా సాధారణ వైరస్ అని భావించి పరీక్షలు చేశారు. అవి negative రావడంతో ఈ వైరస్ కొన్ని వారాల పాటు గుర్తించబడకుండానే వ్యాప్తి చెందింది.
ప్రస్తుతం 69 మంది రోగులు ఎబోలా చికిత్స కేంద్రాల్లో treatment తీసుకుంటున్నారని కాంగో ఆరోగ్య శాఖ మంత్రి రోజర్ కాంబ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కేసులు పెరగడం, ఆరోగ్య సిబ్బంది మరణాలు, ప్రజల తరచు రాకపోకలు — ఇవి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని WHO Director General టెడ్రోస్ అధనం అన్నారు. సరిహద్దులోని ఉగాండా రెండు ప్రావిన్సులకూ ఆరోగ్య సిబ్బందిని పంపిస్తామని ఆయన తెలిపారు.
భారత్‌లో ప్రస్తుతం ఎబోలా వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని experts సూచిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com