హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 3:04 PM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

బెంగళూరులో ఏడాదిగా మూసి ఉన్న ఇంట్లో మహిళ అస్థిపంజరం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బెంగళూరులో ఏడాదిగా మూసి ఉన్న ఇంట్లో మహిళ అస్థిపంజరం
📷 shyam mishra / Pexels
షేర్ కాపీ అయింది ✓

బెంగళూరులోని బాగలగుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి మహిళ అస్థిపంజరం లభ్యమైంది. ఏడాదిగా మూసి ఉన్న ఆ ఇంటి బాత్రూంలో ఈ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు.

సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాత్రూంలో ఎముకలను గుర్తించారు. మృతురాలి భర్త ఉమేశ్ గతంలో మరణించినట్లు, కొడుకు క్యాన్సర్‌తో చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

పోలీసులు అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com