హైదరాబాద్ 27°C
అమరావతి 31°C
IST 10:13 AM
శనివారం ఆగస్టు 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో కార్మికుడి మృతిపై ప్రపంచ బ్యాంక్ ఆందోళన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అమరావతి నిర్మాణంలో కార్మికుడి మృతిపై ప్రపంచ బ్యాంక్ ఆందోళన
📷 David Iloba / Pexels
షేర్ కాపీ అయింది ✓

అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కార్మికుడి మృతి చెందిన ఘటనపై ప్రపంచ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 14న దొండపాడు సమీపంలో రహదారి అండర్‌గ్రౌండ్ పనులు జరుగుతుండగా మట్టి పెళ్లలు కూలి ఒక కార్మికుడు మృతి చెందాడు.

ఘటన జరిగిన తర్వాత ప్రపంచ బ్యాంక్ బృందం దొండపాడులో ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. కార్మికుల భద్రత కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యల వివరాలను కోరింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కార్మికుడి మరణానికి కారణం, ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవాలని ఆ కమిటీకి సూచించింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తోంది. కార్మికుల భద్రతా నిబంధనలు పాటించకపోతే నిధుల విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com