లారీ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన యువకుడు ప్రభుత్వ సాయం కోరుతున్నాడు
హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన అభినవ్ అనే యువకుడు రెండేళ్ల క్రితం లారీ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రభుత్వ సాయం కోసం వేడుకుంటున్నాడు.
అభినవ్ ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తన సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని ఒక కాలు అక్కడికక్కడే తెగిపోయింది. మరో కాలు ఇన్ఫెక్షన్ కారణంగా తీసివేయాల్సి వచ్చింది. రెండు కాళ్లు పోవడంతో అభినవ్ ఇంటికి పరిమితం అయ్యాడు.
అభినవ్ తన కథను వివరిస్తూ, “నేను ఫార్మా కంపెనీలో సెకండ్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నాను. లారీ రాంగ్ రోడ్ లో వచ్చి నన్ను ఢీకొట్టింది. ఆన్ ది స్పాట్ ఒక లెగ్ కట్ అయిపోయింది. ఇంకో లెగ్ లో ఇన్ఫెక్షన్ వచ్చి తీసేయాల్సి వచ్చింది. పెన్షన్ కోసం రెండు, మూడు సార్లు అప్లై చేశాను, కానీ ఇప్పటి వరకు రాలేదు. నాకు స్కూటీ ఇస్తే బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటాను” అని చెప్పాడు.
అభినవ్ తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఇతని దుస్థితి చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమ కొడుకుకు ఆర్థిక సాయం, వైద్య సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com