మాజీ DSP భీమ్ రెడ్డి కేసులో హైదరాబాద్‌లో 8 బినామీ ఇళ్లలో ACB సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మాజీ DSP భీమ్ రెడ్డి బినామీ ఆస్తులపై ACB అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ పుప్పాలగూడతో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
సోదాల్లో ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక రికార్డులను అధికారులు పరిశీలించారు. ఒక అనుమానిత బినామీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, విదేశీ కరెన్సీ లభించినట్లు సమాచారం.
భీమ్ రెడ్డికి చెందిన CA వెంకటేష్ ఇళ్లలో భారీగా నగదు లభించినట్లు అధికారులు గుర్తించారు. భీమ్ రెడ్డి, వెంకటేష్ కలిసి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల భీమ్ రెడ్డి ₹9 కోట్లతో ఒక విల్లాను కొనుగోలు చేసినట్లు ACB గుర్తించింది.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆధారాల ఆధారంగా భీమ్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com