దిల్సుఖ్నగర్లో మాంగల్య షాపింగ్ మాల్ 15వ బ్రాంచ్ ప్రారంభించిన నటి మీనాక్షి చౌదరి
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగల్య షాపింగ్ మాల్ 15వ బ్రాంచ్ ప్రారంభమైంది. సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే బాలాల పాల్గొన్నారు.
బ్రాండెడ్ వస్త్రాలకు మాంగల్య షాపింగ్ మాల్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అని మీనాక్షి చౌదరి అన్నారు. అన్ని వయసుల వారికీ, కుటుంబ సభ్యులకూ సరసమైన ధరల్లో దుస్తులు లభిస్తాయని యజమాని నమఃశివాయ తెలిపారు.
త్వరలోనే కోదాడలో మరో బ్రాంచ్ ప్రారంభిస్తామని నమఃశివాయ ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆషాడం సేల్ కూడా నిర్వహించి కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com