ఆదిలాబాద్: గుడిని స్కూలుగా మార్చిన ఆదివాసీలకు కలెక్టర్ స్పందన; ₹11 లక్షలతో కొత్త భవనం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం టేక్డిగూడ గ్రామంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం పిల్లల సంఖ్యకు సరిపోకపోవడంతో గ్రామస్థులు ఆంజనేయ స్వామి ఆలయాన్ని తాత్కాలిక స్కూలుగా మార్చుకున్నారు.
ఈ విషయంపై ఓ ప్రాంతీయ వార్తా ఛానల్ లో ప్రసారమైన కథనం దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. పాఠశాల నిర్మాణానికి ₹11 లక్షలు కేటాయించారు. ఆరు నెలల వ్యవధిలోనే కొత్త భవనం పూర్తి అయ్యింది. దీనిని కలెక్టర్ ప్రారంభించారు.
నూతన భవనం లభించినందుకు గ్రామ ప్రజలు సంప్రదాయ రీతిలో కలెక్టర్ కు సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘పిల్లలు ఇంట్లో హోంవర్క్ పూర్తి చేయడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలను చిన్న చిన్న పనులకు పంపించడం వల్ల వారు విద్యకు దూరం అవుతారు. కష్టం, ఇష్టం రెండింటినీ సమన్వయం చేసే చదివిస్తేనే వారు మంచి స్థాయికి చేరుకుంటారు’ అని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com