హైదరాబాద్ 27°C
అమరావతి 28°C
IST 4:28 PM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
📷 Khaas Photographer / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎనిమిది పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల్లో చైర్ పర్సన్ సహా వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కావడంతో మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకే పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 13 నగరపాలక సంస్థలు మరియు 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 2382 స్థానాలకు 11705 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 99 లక్షల 36 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ ఇవ్వగా, మొత్తం 17 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో 15 మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒకటి BJP కి, ఒకటి జనసేనకు దక్కాయి. మిగిలిన 83 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

671 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, వెబ్ కెమెరాలు, సున్నిత ప్రాంతాల్లో డ్రోన్లు, CC కెమెరాలు మరియు వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుపుతారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి మున్సిపల్ చైర్ పర్సన్ లేదా మేయర్ స్థానానికి, మరొకటి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ కు వేయాలి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు SEC ఆధ్వర్యంలో పలు చర్యలు చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 726 వార్డులు ఏకగ్రీవం కాగా, కూటమి పార్టీలు అత్యధిక వార్డులు కైవసం చేసుకున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com