బాంబు బెదిరింపుల నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక నుంచి అభిమానులకు అమితాబ్ అభివాదం
బాంబు బెదిరింపుల నేపథ్యంలో నటుడు అమితాబ్ బచ్చన్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ముంబైలోని తన నివాసం జల్సా ఎదుట ఆయన వారానికి ఒకసారి అభిమానులను కలుస్తుంటారు.
ప్రూఫ్ గ్లాస్ క్యాబిన్ లోపల నుంచే ఆయన చేతులు జోడించి నమస్కారం చేశారు. ఆయన వెనుకే కుమారుడు అభిషేక్ బచ్చన్ నిలబడి తండ్రిని గమనిస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జల్సాను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య దాడి చేస్తామంటూ ముంబై పోలీసులకు ఈమెయిల్స్ అందాయి. దీంతో ముంబై పోలీసులు ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా ఆందోళనల మధ్య కూడా అమితాబ్ అభిమానులను కలిసే పద్ధతిని కొనసాగించారు.
గతంలో జుహులో నటుడు టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా గాయపడ్డారు.
ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నిందితులు అంతకుముందే అమితాబ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ల భద్రతను పోలీసులు పెంచారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com