హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 9:46 AM
బుధవారం జూలై 15 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

అనకాపల్లి ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం; ప్రాణనష్టం తప్పింది, విచారణకు డిమాండ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అనకాపల్లి ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం; ప్రాణనష్టం తప్పింది, విచారణకు డిమాండ్
📷 Mikhail Nilov / Pexels
షేర్ కాపీ అయింది ✓

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ ఫార్మాసిటీలో శ్రీ సాయి చంద్ర ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ప్రొడక్షన్ బ్లాక్‌లో రాత్రి 1.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, సీ షిఫ్ట్‌లో విధులు నిర్వర్తించిన కార్మికుల పూర్తి వివరాలు వెల్లడించాలని ఫార్మాసిటీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.

ప్రమాదానికి గల కారణాలు, యాజమాన్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. ఫార్మాసిటీలో ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలు బాయిలర్ దగ్గర మొదలైనట్లు ప్రాథమిక సమాచారం.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com