హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:53 AM
శనివారం జూలై 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 44.71 లక్షల ఓట్లు తొలగింపు; జూలై 31న ముసాయిదా జాబితా విడుదల

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఆంధ్రప్రదేశ్‌లో 44.71 లక్షల ఓట్లు తొలగింపు; జూలై 31న ముసాయిదా జాబితా విడుదల
📷 Luca Severin / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 44,71,523 (10.57%) ఓట్లు తొలగించాల్సిన జాబితాలో వచ్చాయి. మరో 8,55,560 ఓట్లు నో మ్యాపింగ్ విభాగంలో ఉన్నాయి. ఈ వివరాలు శుక్రవారం నాటికి పూర్తయిన ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ నుండి వెల్లడయ్యాయి.

మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 3,71,56,171 (89.25%) మంది పత్రాలు డిజిటలైజ్ చేశారు. వివరాల్లో తప్పులు ఉన్న 8,55,560 మందికి నో మ్యాపింగ్ చేసి నోటీసులు ఇవ్వనున్నారు. సరైన వివరాలు ఇవ్వకపోతే వీరి ఓట్లు కూడా తొలగింపు జాబితాలో చేరనున్నాయి.

తొలగించాల్సిన 44.71 లక్షల ఓట్లలో 15,19,558 మంది మరణించినవారు, 14,34,112 మంది శాశ్వతంగా వలస వెళ్ళినవారు, 7,76,900 మంది చిరునామాలు లేనివారు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా అత్యధికంగా నెల్లూరు (2,90,579), తిరుపతి (2,87,759), కడప (2,44,879), విశాఖపట్నం (2,39,146), గుంటూరు (2,37,789) జిల్లాల్లో ఓట్లు తొలగించాల్సి ఉంది.

ఈ నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు క్లెయిమ్‌లు చేసుకోవచ్చు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత అక్టోబర్‌లో తుది జాబితా ప్రచురిస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com