హైదరాబాద్ 27°C
అమరావతి 32°C
IST 9:28 AM
ఆదివారం జూలై 26 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 10 కొత్త కరోనా కేసులు; మొత్తం 49కి చేరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో 10 కొత్త కరోనా కేసులు; మొత్తం 49కి చేరిక
📷 Ranjeet Chauhan / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది.

తాజా కేసుల్లో గుంటూరు జిల్లాలో ముగ్గురికి, ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరికి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున కరోనా సోకింది.

రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్న జిల్లా తూర్పు గోదావరి. ఇక్కడ 11 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 9, వైఎస్ఆర్ కడపలో 8, విశాఖపట్నంలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రెండేసి, మరికొన్ని జిల్లాల్లో ఒక్క కేసు చొప్పున నమోదైంది.

కరోనా బాధితుల్లో 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 16 మంది ఇంటి వద్ద వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు కోలుకోగా, నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు వైఎస్ఆర్ కడప జిల్లాకు, ఒకరు కాకినాడ జిల్లాకు చెందినవారు.

కొత్త కేసులు నమోదవడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. పరీక్షల కోసం ఆర్టిపిసిఆర్ కిట్లు అందుబాటులో ఉంచారు. రోగుల చికిత్స, పర్యవేక్షణ, ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, మందులు, పరికరాల ఏర్పాటుపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com