హైదరాబాద్ 23°C
అమరావతి 28°C
IST 10:41 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

ఏపీలో వడగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు; జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో వడగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు; జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
📷 Arto Suraj / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ఇవాళ పోలవరం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేశారు.

ప్రజలు అపరమతంగా ఉండాలని, ఎండ తీవ్రత నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com