హైదరాబాద్ 24°C
అమరావతి 30°C
IST 12:04 AM
ఆదివారం ఆగస్టు 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడ మాస మహోత్సవాలు ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడ మాస మహోత్సవాలు ప్రారంభం
📷 Pavan Prasad / Pexels
షేర్ కాపీ అయింది ✓

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాడ మాస మహోత్సవాలు ఇవాళ ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ముందుగా ఘాట్ రోడ్ ఓం మలుపు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి పట్టుచీర సమర్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో సారాను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు.

ఈ నెల 27, 28, 29 తేదీల్లో శాకంబరి ఉత్సవాలు నిర్వహించనుండగా, 26న హైదరాబాద్ నుంచి బంగారు బోనాన్ని ఆలయానికి సమర్పిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com