హైదరాబాద్ 25°C
అమరావతి 29°C
IST 8:28 AM
శుక్రవారం సెప్టెంబర్ 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు సిద్ధం; ఈరోజు లడ్డు వేలంపాట

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు సిద్ధం; ఈరోజు లడ్డు వేలంపాట
📷 Ravi Kant / Pexels
షేర్ కాపీ అయింది ✓

బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవానికి సిద్ధమయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి విశేష పూజలు నిర్వహించారు. కాసేపట్లో గణేష్ విగ్రహాన్ని క్రేన్ సాయంతో ట్రాలీపైకి తరలిస్తారు.

అనంతరం గ్రామంలోని నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రామ బొడ్రాయి దగ్గర లడ్డు వేలంపాట జరుగుతుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవాలు 1980లో ప్రారంభమయ్యాయి. 1994 నుంచి 21 కేజీల లడ్డును వేలం వేసే సంప్రదాయం కొనసాగుతోంది.

ఈ లడ్డును తాపేశ్వరం హనీ ఫుడ్స్ సంస్థ ప్రత్యేక నియమాలతో తయారు చేస్తుంది. వెండి పాత్రలో ఉంచిన ఈ లడ్డును గణేష్ విగ్రహం చేతికి అమరుస్తారు.

ఈసారి వేలంలో పాల్గొనేవారు ముందుగా ₹35 లక్షలు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టారు. అదనంగా ₹5,000 రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి తొమ్మిది మంది కొత్తవారు పాల్గొననున్నారు.

ప్రస్తుతం గణేషుడికి పూజలు నిర్వహిస్తున్నారు. తర్వాత గ్రామోత్సవం, ఆ తర్వాత లడ్డు వేలంపాట ప్రారంభమవుతుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com