భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి నుంచే వాణిజ్య విమానాలు
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి పూర్తి స్థాయి వాణిజ్య విమానాలు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం శీలానగర్‌లోని పాత విమానాశ్రయం నుంచి ఈ రాత్రితో కమర్షియల్ ఫ్లైట్స్ నిలిచిపోతాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం అక్కడి రన్‌వే ఇకపై కేవలం మిలిటరీ, నేవీ, రక్షణ అవసరాలు, VIP విమానాల రాకపోకలకే పరిమితం కానుంది. విశాఖపట్నం అంతర్జాతీయ కోడ్ VTZ ఇకపై భోగాపురం నుంచే నిర్వహితమవుతుంది.
విశాఖపట్నం ఎంపీ భరత్ పాత విమానాశ్రయం నుంచి చివరి ప్రయాణం సందర్భంగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆరు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకు సేవలందించిన విమానాశ్రయానికి ఇది గర్వకారణమైన వీడ్కోలు అని ట్వీట్ చేశారు.
ప్రయాణికుల కోసం APSRTC 20 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. వీటి పేరు Aero Express. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బస్సులను ప్రారంభించారు. ఒకసారి చార్జ్ చేస్తే ఇవి 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు.
భోగాపురంలో ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతోపాటు నవ్యాంధ్ర ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం అందిస్తుందని అధికారులు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com