హైదరాబాద్ 27°C
అమరావతి 27°C
IST 9:47 AM
సోమవారం నవంబర్ 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. అమిత్ షా పాల్గొననున్నారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. అమిత్ షా పాల్గొననున్నారు
📷 Captgs / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో పాల్గొనేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ చేరుకుంటున్నారు. నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది.

మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అమ్మవారికి పూజలు చేస్తారు. తర్వాత బేగంపేటలోని కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్ రోడ్లపై సుమారు 2.5 కిలోమీటర్ల మేర దాదాపు గంట సేపు పాదయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమి, ఇతర ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వడమే ఈ పాదయాత్ర లక్ష్యమని బీజేపీ చెప్తోంది. ఢిల్లీలో INDIA కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కౌంటర్‌గా హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంది.

పాదయాత్ర అనంతరం జరిగే ప్రజా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com