మిర్యాలగూడ డిగ్రీ కాలేజీలో బోనాల వేడుకలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చారు.
కాలేజీ లెక్చరర్లు విద్యార్థులకు బోనాల పండగ విశిష్టతను వివరించారు. విద్యార్థులు పోతరాజుల వేషాధారణలో డప్పు చప్పులకు నృత్యాలు చేశారు. సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని లెక్చరర్లు తెలిపారు.
బోనాల పండుగ తెలంగాణలో ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ప్రత్యేక సంస్కృతీ వైభవం. హైదరాబాద్‌లోని గోల్కొండ నుంచి ఆరంభమై రాష్ట్రమంతటా గ్రామదేవతలైన మహంకాళి, మైసమ్మ, ముత్యాలమ్మలకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. మహిళలు నైవేద్యంతో కూడిన బోనాలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా తరలివెళతారు. పంటలు పుష్కలంగా ఉండాలని, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ పూజలు చేస్తారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com