హైదరాబాద్ 28°C
అమరావతి 30°C
IST 9:48 AM
శుక్రవారం అక్టోబర్ 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

బియాండ్ ద డివైడ్ ఎక్స్‌పోలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ పాల్గొంటారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బియాండ్ ద డివైడ్ ఎక్స్‌పోలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ పాల్గొంటారు
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ట్రస్టీ సి.ఎస్. రంగరాజన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే 'బియాండ్ ద డివైడ్' ఎక్స్‌పోలో పాల్గొంటారు. జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల ఆఖర్లో ఈ ప్రదర్శన జరగనుంది.

ఈ ఎక్స్‌పోలో భాగంగా ఈ నెల 31న సాయంత్రం బహుళ మతాల చర్చ (Multi Faith Discourse) నిర్వహిస్తారు. వివిధ మతాలకు చెందిన మత గురువులు, ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరవుతారని రంగరాజన్ తెలిపారు.

సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం జరగాలని ఆయన అన్నారు. సామరస్య వాతావరణాన్ని పెంచేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలో అందరూ ఒక కుటుంబంలా జీవించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, అన్ని మతాల ప్రజలు ఈ కార్యక్రమానికి రావాలని కోరారు. ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com