సాంకేతిక

చైనా నిర్మించిన సముద్రగర్భ డేటా సెంటర్; విద్యుత్, నీటి వాడకంలో భారీ తగ్గింపు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చైనా నిర్మించిన సముద్రగర్భ డేటా సెంటర్; విద్యుత్, నీటి వాడకంలో భారీ తగ్గింపు
📷 Abdulkadir Emiroğlu / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. AI, క్లౌడ్ సర్వీసుల విస్తరణతో సర్వర్లను చల్లబరచడం పెద్ద సవాలుగా మారింది. కేవలం కూలింగ్ కోసమే మొత్తం విద్యుత్ లో 40% ఖర్చవుతోంది. 2030 నాటికి డేటా సెంటర్ల అవసరాల కోసం ఒక దేశానికి సరిపడా మంచినీరు అవసరమవుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

ఈ సమస్యకు చైనా ఒక వినూత్న పరిష్కారం కనుగొంది. షాంగై, హైనాన్ తీరాలకు దూరంగా సముద్ర గర్భంలో 115 అడుగుల లోతున భారీ స్టీల్ క్యాప్సుల్స్ ఏర్పాటు చేసింది. ఒక్కో క్యాప్సుల్ బరువు 1300 టన్నులు. ఇది సుమారు 2000 హై-ఎండ్ సర్వర్లను కలిగి ఉంటుంది.

ఈ క్యాప్సుల్స్ సముద్రపు చల్లని నీటిని సహజ కూలెంట్ గా ఉపయోగించుకుంటాయి. దీంతో విద్యుత్ ఖర్చు 22% తగ్గుతుంది. అంతేకాకుండా భూమి, మంచినీటి వాడకం పూర్తిగా నివారించబడుతుందని చైనా వెల్లడించింది. భవిష్యత్తులో డేటా సెంటర్ల పర్యావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ఈ సాంకేతికత కీలకమని నిపుణులు భావిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com