హైదరాబాద్ 29°C
అమరావతి 32°C
IST 7:04 PM
శుక్రవారం సెప్టెంబర్ 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

విద్యా సంస్థల సందర్శన కోసం సీఎం రేవంత్ రెడ్డి యూకే, అమెరికా పర్యటన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విద్యా సంస్థల సందర్శన కోసం సీఎం రేవంత్ రెడ్డి యూకే, అమెరికా పర్యటన
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల మూడో వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 18 నుంచి 20 తారీఖుల మధ్య పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా యూకే, ఆ తర్వాత అమెరికా వెళ్లనున్నారు.

ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థలు, నైపుణ్య కేంద్రాలను ఆయన సందర్శిస్తారు. తెలంగాణలో విద్య, క్రీడ, నైపుణ్య రంగాల అభివృద్ధికి ఆయా సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి వెంట మాజీ సీఎస్, సలహాదారు కే. రామకృష్ణరావు, ఇతర అధికారులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఈ పర్యటన ద్వారా మరిన్ని ప్రఖ్యాత సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశం ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com