మురసు తుఫాను ప్రభావం: కాకినాడలో వర్షం, రోడ్లు జలమయం
కాకినాడ జిల్లాలో మురసు తుఫాను ప్రభావంతో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.
తుఫాను రాత్రి తీరం దాటిన సమయంలో భారీ ఈదురుగాలులు వీచాయి. సుమారు 10 చోట్ల చెట్లు నేలకొరిగాయని అధికారులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ఆ చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు కూలిన చోట వాటిని మళ్లీ నిలబెట్టేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
తుఫాను తీరం దాటే సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఇటీవల కాకినాడను అతలాకుతలం చేసిన తుఫాను ప్రభావం నాలుగు రోజుల పాటు కొనసాగింది. ఈసారి మురసు ప్రభావం ఆ తుఫాను కంటే తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవాళ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. వర్షం వల్ల ఇబ్బంది తలెత్తకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాలను భవనాల్లోనే ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com