హైదరాబాద్ 25°C
అమరావతి 28°C
IST 10:07 AM
సోమవారం జూలై 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు
📷 Long Bà Mùi / Pexels
షేర్ కాపీ అయింది ✓

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒడిస్సాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాలతో పాటు యానం ప్రాంతానికి yellow alert జారీ చేశారు.

సముద్రం అల్లకల్లోలంగా మారనుండడంతో మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని కూడా ఐఎమ్డీ తెలిపింది. ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com