తూర్పుగోదావరిలో పంటపొలాల్లో పేకాట: ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం సివారులో పోలీసులు డ్రోన్ సహాయంతో పేకాట స్థావరాన్ని గుర్తించారు. పంటపొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులను చూసిన పేకాట రాయుళ్లు పొలం గట్లు, ముళ్లపొదలు లెక్కచేయకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com