హైదరాబాద్ 30°C
అమరావతి 30°C
IST 3:24 PM
శనివారం నవంబర్ 14 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

పాతబస్తీలో ఏనుగు అదుపు తప్పి.. ప్రజలు భయంతో పరుగులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పాతబస్తీలో ఏనుగు అదుపు తప్పి.. ప్రజలు భయంతో పరుగులు
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఉన్న ఇరానీ గల్లీ ప్రాంతంలో గ్యార్వీ షరీఫ్ ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగు అదుపు తప్పింది. రోడ్డుపై ఏనుగు అతి వేగంగా పరుగులు తీయడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

జెండా కార్యక్రమం ప్రారంభం కాకముందే అలంకరించిన ఏనుగు అదుపు తప్పింది. ప్రజల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీంతో ఇరుకు గల్లీల్లో ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారుల సహాయంతో ఏనుగుకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అదుపు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, డిసిపి కూడా ఘటనా స్థలానికి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడారు.

అనంతరం ఏనుగును లారీలో ఎక్కించి కర్ణాటక రాష్ట్రం వైపు పంపించారు. AIMIM ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకుని నిర్వాహకులతో చర్చలు జరిపారు.

బ్యాండ్ బాజాలు, DJ శబ్దాల వల్లే ఏనుగు అదుపు తప్పినట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఏనుగును మళ్లీ ఊరేగింపులో తీసుకెళ్తే అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు నిర్వాహకులకు హెచ్చరించారు. ప్రస్తుతం ఏనుగుపై అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. జెండా కార్యక్రమం మాత్రం ఒంటెలతో కొనసాగింది.

ఇరానీ గల్లీ, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ ప్రాంతాల్లో సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. మతపరమైన కార్యక్రమాల కోసం హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తీసుకొస్తుంటారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com