హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 3:36 PM
శుక్రవారం జూలై 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద: నీటిమట్టం 147 మీటర్లకు చేరింది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద: నీటిమట్టం 147 మీటర్లకు చేరింది
📷 Rohit Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీ వరద నీటితో నిండింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, కడం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పెద్ద ఎత్తున నీరు ఎల్లంపల్లిలోకి చేరింది. ప్రాజెక్ట్ నీటి మట్టం 147 మీటర్లకు చేరుకుంది. పూర్తి నీటి మట్టం 148 మీటర్లు.

ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 20 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 1.47 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వస్తోంది. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 1 లక్ష క్యూసెక్కులు, కడం జలాశయం నుంచి 46 వేల క్యూసెక్కులు వచ్చి చేరాయి. అధికారులు 15 గేట్లు ఎత్తి 92 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నంది పంప్ హౌస్ ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేర్ ప్రాజెక్ట్‌కు పంపిస్తున్నారు.

మిడ్‌మానేర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 308 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 27 టీఎంసీల సామర్థ్యానికి నీరు ఇంకా రావాల్సి ఉంది. లోయర్ మానేర్ ప్రాజెక్ట్‌లో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు. ఇక్కడికి క్యాచ్‌మెంట్ నుంచి పెద్దగా నీరు రావడం లేదు. నీటిని తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తున్నారు.

ఇటీవల మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలకు కొంత నీరు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండడంతో తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వర్షాలు వరినారుకు, పత్తి, ఇతర ఆరుతడి పంటలకు ఉపయోగపడతాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com