తెలంగాణ

మెదక్ జిల్లాలో దెబ్బతిన్న రహదారిపై వరినాట్లు నాటిన రైతులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మెదక్ జిల్లాలో దెబ్బతిన్న రహదారిపై వరినాట్లు నాటిన రైతులు
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

మెదక్ జిల్లా మూసాయిపేట మండలం రామంతపూర్‌లో రైతులు వినూతన నిరసన తెలిపారు. కంకరమిషన్ లారీల రాకపోకల వల్ల పూర్తిగా పాడైపోయిన రహదారిపై వరినాట్లు నాటి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంకర క్రషర్ వాహనాలు ఓవర్ లోడ్‌తో నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల ఈ రహదారి గుంతల మయంగా మారిందని రైతులు ఆరోపించారు. దీంతో పొలాలు, బావుల వైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి పూట ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని, చాలా మంది బైక్‌పై స్కిడ్ అయి పడిపోతున్నారని చెప్పారు. ఈ గుంతల వల్ల నడుము నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వివరించారు.

సర్పంచ్, వార్డ్ సభ్యులతో సహా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని, క్రషర్ వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com