గచ్చిబౌలీ భవనం కూలిన ఘటన: టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్
హైదరాబాద్ గచ్చిబౌలీలో ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.
సంతోష్ కుమార్ మాదాపూర్ సర్కిల్ 50లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (TPBO)గా పనిచేస్తున్నారు. అధికారుల విధుల నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగిందని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ సమయంలో సంతోష్ కుమార్ హెడ్ క్వార్టర్స్ స్థానిక పరిధిలో ఉండాలని ఆదేశించారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని స్పష్టం చేశారు.
40 గజాల స్థలంలో సాజిద్ అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం తర్వాత సాజిద్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపుకు అంతరాయం ఏర్పడింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నారా అన్న అనుమానం ఉంది.
ఇవాళ జయదర్శి అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసే అవకాశం ఉంది. దీనికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com