రక్షాబంధన్ వేళ ఘజియాబాద్‌లో 1,000 కిలోల రసగుల్లాలు స్వాధీనం
రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భారీ కల్తీ వ్యాపారం బయటపడింది. ఘజియాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ గోదాంపై దాడి చేసి 1,000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు.
రాఖీ పండుగ దృష్ట్యా గత కొన్ని రోజులుగా స్థానిక ఆహార విక్రయ దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీహారి పూరా ప్రాంతంలోని ఓ గోదాంలో పెద్ద ఎత్తున కల్తీ స్వీట్లు తయారు చేసి నిల్వ చేసినట్లు వారికి సమాచారం అందింది.
గోదాంపై దాడి చేసిన అధికారులు కల్తీ పన్నీర్, చక్కెర, రసాయనాలతో తయారు చేసిన రసగుల్లాలను గుర్తించారు. కొన్ని శాంపిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. గోదాం నిర్వాహకుల లైసెన్స్ రద్దు కోసం చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com