తెలంగాణ

భూపాలపల్లి జిల్లాలో భూగర్భ జలాలు ఉబికి రావడంతో రైతులు సంతోషం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భూపాలపల్లి జిల్లాలో భూగర్భ జలాలు ఉబికి రావడంతో రైతులు సంతోషం
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి చిమ్మడం విశేషం. ఇక్కడ రైతులు ఇటీవల మూడు బోర్లు వేశారు. మోటార్లు అమర్చకుండానే నీరు పైకి రావడం గమనించారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాల స్థాయి పెరిగినందున బోర్ల నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ దృశ్యం చూసిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com