హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 4:06 PM
మంగళవారం ఆగస్టు 18 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో NSB కార్ డెకార్స్‌లో వెల్డింగ్ చేస్తుండగా మంటలు; నాలుగు కార్లు కాలిపోయాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నరసరావుపేటలో NSB కార్ డెకార్స్‌లో వెల్డింగ్ చేస్తుండగా మంటలు; నాలుగు కార్లు కాలిపోయాయి
📷 Alexander Zvir / Pexels
షేర్ కాపీ అయింది ✓

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వెనుకొండ రోడ్డులో ఉన్న NSB కార్ డెకార్స్‌లో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు కార్లు పూర్తిగా కాలిపోయాయి.

మంటలు పక్కనే ఉన్న బిర్యానీ సెంటర్‌కు వ్యాపించాయి. మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పొగ కారణంగా ఊపిరాడక స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com