హైదరాబాద్ 30°C
అమరావతి 35°C
IST 2:34 PM
ఆదివారం ఆగస్టు 9 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

శ్రీరామ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శ్రీరామ సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ఇప్పుడు 1078 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం 41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 16,500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు; ప్రస్తుతం 1399 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు, ఇప్పుడు 11 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 9,000 క్యూసెక్కులు.

శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు, నిజాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 2.30 లక్షల నుంచి 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాయి. ఈ ప్రాజెక్టుల కింద ఉన్న రైతులు వరద నీటి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com