వాతావరణం

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక – 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక – 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే మూడు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని 14 జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, మహబూబ్నగర్, ములుగు, నాగర్కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు (శనివారం) ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. ఆదివారం కోస్తా జిల్లాలైన కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాల దగ్గర నిలబడొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, పశువుల కాపర్లు కాలువలు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com