హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 9:18 AM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ వర్షం : పలు ప్రాంతాలు జలమయం, సహాయక చర్యలు చేపట్టిన GHMC

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో భారీ వర్షం : పలు ప్రాంతాలు జలమయం, సహాయక చర్యలు చేపట్టిన GHMC
📷 versolaluce / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుద్బుల్లాపూర్, నాగోల్, ఎల్బి నగర్, చంపాపేట, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాలలో భారీ వాన పడింది. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది.

GHMC సిబ్బంది, హైడ్రా రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల ద్వారా తొలగించారు. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.

సరూర్ నగర్‌లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఎల్బీ నగర్ 10 సెం.మీ, ఉప్పల్ 9 సెం.మీ, నాగోల్ 8 సెం.మీ, వనస్థలిపురం, కాపరా ప్రాంతాల్లో 7 సెం.మీ చొప్పున వానపడింది. ఇతర ప్రాంతాలైన ఏఎస్ రావ్ నగర్, రాజీవ్ నగర్, మల్కాజగిరి, కూకట్పల్లిలో 2 నుంచి 4 సెం.మీ వర్షం కురిసింది.

రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. GHMC సిబ్బంది నీటి తొలగింపు పనులు కొనసాగిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com