మంచిర్యాల: భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది
మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
వర్షాలకు ఓపెన్ కాస్ట్ మైన్స్ అంతా జలమయమైపోయింది. గనుల్లోని రవాణా మార్గాలు బురదమయంగా మారడంతో ఎస్కలేటర్లు, లారీల రాకపోకలు స్తంభించిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనుల గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.
దీని కారణంగా సింగరేణి సంస్థకు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి, కోట్లలో ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గనుల్లోకి మరింత నీరు చేరకుండా, ఉన్న నీటిని బయటకు పంపేందుకు యాజమాన్యం మోటార్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టింది. ఉత్పత్తి పునరుద్ధరణ కోసం కంట్రోల్ రూముల పర్యవేక్షణతో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com