హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 4:50 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

తెలంగాణలో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఐఎండి హెచ్చరిక

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో భారీ వర్షాలు, మూడు రోజుల పాటు ఐఎండి హెచ్చరిక
📷 Nathan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. వచ్చే మూడు రోజులు 10 జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది.

జగిత్యాల జిల్లా సారంగపూర్‌లో 19 సెంటీమీటర్ల వర్షం, బుగ్గారంలో 17 సెం.మీ, ఎండపల్లిలో 16 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలెంలో 16 సెం.మీ, నిర్మల్ జిల్లాలో 13 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 12 సెం.మీ, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 12 సెం.మీ, నిజామాబాద్ జిల్లాలో 10 సెం.మీ వర్షం నమోదైంది.

భారీ వర్షాలతో చెరువులు నిండి వాగులు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రహదారులు కోతకు గురికావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

చాలా రోజుల తర్వాత వర్షాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com