లాల్ దర్వాజా బోనాలకు 2000 మంది పోలీసులతో భద్రత: CP సజ్జనార్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాలి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు సుమారు 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్ లాంటి సంఘటనలు జరగకుండా షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ 24 గంటల నిఘా పెట్టాయని తెలిపారు. గతంలో గోల్కొండ, బల్కంపేట బోనాలు ప్రశాంతంగా ముగిశాయని, ప్రజలు, భక్తులు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే జూలై 10న జరిగే బోనాల ఉత్సవానికి, అలాగే ఉజ్జయినీ మహంకాళి బోనాలకు భక్తులు, ఆలయ కమిటీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ సలహా చూసి ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ తఫ్సీర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఈవో శ్రీనివాసు, డీసీపీ కిరణ్ కేరే, ఆలయ కమిటీ సభ్యులు అరవింద్ గౌడు, వెంకటేశ్వర్లు, మాణిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com