హైదరాబాద్ 30°C
అమరావతి 26°C
IST 4:29 PM
శనివారం నవంబర్ 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

టపాసులపై హైదరాబాద్ అగ్నిమాపక శాఖ హెచ్చరిక.. జాగ్రత్తలు పాటించాలని సూచన

రచన: ఉషా కిరణం డెస్క్ ·
టపాసులపై హైదరాబాద్ అగ్నిమాపక శాఖ హెచ్చరిక.. జాగ్రత్తలు పాటించాలని సూచన
📷 Danielle Calazans / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న దీపావళి వేడుకలపై సూచనలు జారీ చేశారు. టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే అగ్ని ప్రమాదాలు, కంటి గాయాలు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇళ్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చాలని సూచించారు. పిల్లలను టపాసులకు దూరంగా ఉంచాలని చెప్పారు. సింథటిక్ దుస్తులకు బదులు కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు. టపాసులు కాల్చే ప్రదేశంలో నీరు, ఇసుక, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

టపాసుల దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించి పరిమిత సరుకే నిల్వ చేసుకోవాలని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం టెంపరరీ లైసెన్సులు ఇస్తున్నారు. లైసెన్సులో ఇచ్చిన గైడెన్స్ మాత్రమే దుకాణాలు పాటించాలని అధికారి సూచించారు.

రెండు దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని ఆయన తెలిపారు. దుకాణం వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్ ఉంచుకోవాలి. రెండు బకెట్లలో డ్రై స్యాండ్ పెట్టుకోవాలి. స్థానిక భాషల్లో నో స్మోకింగ్ బోర్డులు పెట్టుకోవాలని చెప్పారు.

కొనుగోలుకు వచ్చే వాహనాలను కనీసం 15 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలని సూచించారు. దుకాణం దగ్గర వాహనాలు స్టార్ట్ చేస్తే సైలెన్సర్ నుంచి స్పార్క్స్ వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. దుకాణాల్లో బ్యాటరీ ఆపరేటెడ్ లైటింగ్ వాడాలని, డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com