హైదరాబాద్ హైకోర్టు: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశం; ప్రభుత్వం అప్పీల్‌కు సన్నాహాలు
హైదరాబాద్‌లోని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వివాద భూమి కేసులో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని, స్థానంలో మరో అధికారిని నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.
27వ తేదీన ఇచ్చిన తీర్పు పూర్తి స్థాయి కాపీ ఇవాళ విడుదలైంది. 53 పేజీల ఈ తీర్పులో, వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్ట విరుద్ధమని, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని ధర్మాసనం పేర్కొంది. కేవలం వ్యక్తుల ఆధిపత్యంతో కాకుండా చట్టపరమైన పాలనే కొనసాగాలని, లేకపోతే ప్రజాస్వామ్యానికి మరణ శాసనమవుతుందని కీలక వ్యాఖ్యలు చేసింది.
రంగనాథ్ ప్రైవేట్ భూములపై చేపట్టిన చర్యలను తీవ్రంగా ఆక్షేపించిన ధర్మాసనం, కోర్టు దిక్కరణ కేసుల్లోనూ హైడ్రా కమిషనర్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ, ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రా కమిషనర్‌ను తొలగించే ప్రశ్నే లేదన్నారు. తీర్పు కాపీని పూర్తిగా అధ్యయనం చేసి, న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com